ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 00:51:29

మహాసామ్రాజ్ఞి వీర గాథ

మహాసామ్రాజ్ఞి వీర గాథ

కాకతీయ మహాసామ్రాజ్ఞిగా భారతీయ చరిత్రపుటల్లో నిలిచిపోయింది రాణి రుద్రమదేవి. అసమాన ధైర్యసాహసాలతో దక్షిణపథాన్ని పాలించిన వీరవనితగా ప్రసిద్ధికెక్కింది. మహా పరాక్రమవంతురాలైన రుద్రమదేవి జీవిత కథ బుల్లితెరపై ‘రాణి రుద్రమ’ పేరుతో ధారావాహికగా రాబోతున్నది. ‘స్టార్‌మా’లో  ఈ నెల 18నుంచి ప్రసారం కానుంది. ‘ధైర్యసాహసాలు మూర్తీభవించిన విశిష్టగాథల్ని తెలుగు ప్రేక్షకులకు అందించడంలో మా సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పరంపరలో తెలుగు నేలపై ధీరవనితగా జగతికెక్కిన రుద్రమదేవి జీవితగాథను ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఈ ధారావాహిక నిర్మాణంలో వందలాది మంది పాలుపంచుకుంటున్నారు. కాకతీయ సామ్రాజ్య వైభవానికి దర్పణంలా, అద్భుత దృశ్యకావ్యంగా ఈ సీరియల్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఇంతకుముందెన్నడు బుల్లితెరపై చూడని ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఈ సీరియల్‌ను  రూపొందిస్తున్నాం’ అని ‘స్టార్‌మా’ సంస్థ తెలిపింది. అనన్య, ఆనంద్‌, రాధి, శ్రీధర్‌రావు, గౌరి తదితరులు ఈ ధారావాహికలో నటిస్తున్నారు.

VIDEOS

logo