గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 11:25:21

క్రేజీ అప్‌డేట్‌తో వ‌చ్చిన ర‌వితేజ‌

క్రేజీ అప్‌డేట్‌తో వ‌చ్చిన ర‌వితేజ‌

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం క్రాక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని  సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌ కథానాయికగా న‌టిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో రవితేజ, అప్సరారాణిలపై  ప్రత్యేకగీతాన్ని చిత్రీకరిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. అయితే  ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని లైన్‌లో పెట్టారు ర‌వితేజ‌.

వీర చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌తో క‌లిసి ర‌వితేజ త‌న 67వ చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో... డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని తీసుకున్నారు. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర...’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ‘రాక్షసుడు’ బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ 2న ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. రేపు ఉద‌యం 11:55 ని.ల‌కు చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు ముహూర్తంకి సంబంధించిన విష‌యాల‌ను రివీల్ చేయ‌నున్నారు.  


logo