శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 16:46:37

హిందీలో అమీర్‌ఖాన్‌..తెలుగులో చిరంజీవి..!

హిందీలో అమీర్‌ఖాన్‌..తెలుగులో చిరంజీవి..!

టాలీవుడ్ యాక్ట‌ర్లు ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్ కాంబోలో వ‌స్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ పాత్ర‌ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్న‌ట్టు వార్త‌లు రాగా, మ‌రి తెలుగులో ఏ స్టార్ హీరో ఇస్తాడని చ‌ర్చ న‌డుస్తోన్న సంగతి తెలిసిందే. ఇంత‌కీ ఆ స్టార్ ఎవ‌ర‌నే దానిపై ఓ అప్ డేట్ ఇపుడు ఫిలింన‌గ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అత‌నెవ‌రో కాదు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి‌.

తెలుగు వెర్ష‌న్ లో చిరంజీవి త‌న వాయిస్ అందించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి దీనిపై రాజ‌మౌళి అండ్ టీం నుంచి అధికారిక ప్ర‌క‌టన రావాల్సి  ఉంది. ఆర్ఆర్ఆర్ లో అలియాభ‌ట్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా..శ్రియ‌, అజ‌య్ దేవ్‌గ‌న్, సముద్ర ఖ‌ని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రియ‌, అజ‌య్ దేవ్ గ‌న్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.