గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 19:09:35

ఆర్ఆర్ఆర్ ట్ర‌య‌ల్ షూట్ షురూ

ఆర్ఆర్ఆర్ ట్ర‌య‌ల్ షూట్ షురూ

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షెడ్యూల్ ఇవాళ హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. కానీ ఇది ఫుల్ లెంగ్త్ షెడ్యూల్ మాత్రం కాదు. క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో రాజ‌మౌళి ట్ర‌య‌ల్ షూట్ ను మొద‌లుపెట్టాడు. సెట్స్ లో అన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు, జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్ నిర్వ‌హించినపుడు ఎవ‌రైనా క‌రోనా బారిన ప‌డ‌క‌పోతే..?  చిత్రీక‌ర‌ణను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాడ‌ట జ‌క్క‌న్న‌‌. ట్ర‌య‌ల్ షూట్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ టీం విరామం తీసుకోనుంది.

ద‌స‌రా పండుగ త‌ర్వాతే మ‌ళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్టు టాక్‌. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్, అలియాభ‌ట్‌, శ్రియా, అజ‌య్ దేవ్ గ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.