బుధవారం 27 జనవరి 2021
Cinema - Nov 11, 2020 , 13:38:09

మొక్క‌లు నాటిన ఆర్ఆర్ఆర్ టీం..వీడియో

మొక్క‌లు నాటిన ఆర్ఆర్ఆర్ టీం..వీడియో

రాజ్య‌స‌భ్య స‌భ్యుడు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే టాలీవుడ్ న‌టుడు రాంచ‌ర‌ణ్ (రామ‌‌రాజు) విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను ఆర్ఆర్ఆర్ చిత్ర‌యూనిట్ స్వీక‌రించింది. ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళితోపాటు చిత్ర‌యూనిట్ స‌భ్యులంతా షూటింగ్ లొకేష‌న్‌లో మొక్క‌లు నాటి సెల్ఫీలు దిగారు. అనంత‌రం రాజ‌మౌళి అండ్ టీం ఆచార్య, రాధేశ్యామ్‌, పుష్ప చిత్ర‌యూనిట్ సభ్యుల‌కు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటాల‌ని కోరారు.

మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడాల‌ని పిలుపునిచ్చారు. రాంచ‌ర‌ణ్,ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ ర‌ణం రౌద్రం రుధిరం (ఆర్ఆర్ఆర్) చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo