ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 09:54:44

నెపోటిజం: ఆర్ఆర్ఆర్‌కు అలియా టెన్ష‌న్

నెపోటిజం: ఆర్ఆర్ఆర్‌కు అలియా టెన్ష‌న్

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లువురు స్టార్స్‌, ద‌ర్శ‌క నిర్మాత‌లు బంధుప్రీతి విష‌యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ కూతురు అలియా భ‌ట్ కూడా నెపోటిజంకి సంబంధించిన విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంటుంది. కంగ‌నా లాంటి వారు అలియాని తీవ్రంగా విమ‌ర్శించగా, అభిమానులు, నెటిజ‌న్స్ ఆమె సినిమాల‌పై బాగా నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు.

మ‌హేష్ భ‌ట్  దర్శ‌క‌త్వంలో అలియా భ‌ట్‌, సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన స‌డ‌ఖ్ 2 చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, దీనికి లైకుల క‌న్నా డిస్ లైక్సే ఎక్కువ వ‌చ్చాయి.  అంటే నెపోటిజం ఎఫెక్ట్ అలియా సినిమాల‌పై ఎంత‌గా ప‌డుతుంద‌నేది తాజా ప‌రిస్థితుల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ క‌థానాయిక‌గా నటించబోతున్న సంగతి తెలిసిందే. మ‌రి ఈ అమ్మ‌డి సెగ ఆర్ఆర్ఆర్ కు కూడా త‌గులుతుందా అని మేక‌ర్స్ భ‌య‌ప‌డిపోతున్నారు. సినీ జనాల్లో సుశాంత్ పై ఉన్న సింపతీ అలియా లాంటి వాళ్ళ‌పై నెగిటివిటీగా మార‌డంతో ఫిలిం మేక‌ర్స్ డైలమాలో ప‌డ్డారు. ఏదేమైన సుశాంత్ కేసు ఓ కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కు వీళ్ల‌కు ఈ బాధ‌లు త‌ప్ప‌వేమో. 


logo