గురువారం 04 మార్చి 2021
Cinema - Nov 17, 2020 , 10:28:09

ఆర్ఆర్ఆర్ స్పూఫ్ వీడియో.. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌

ఆర్ఆర్ఆర్ స్పూఫ్ వీడియో.. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌

ఈ మ‌ధ్య స్పూఫ్ వీడియోల ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ఏదైన సినిమాలో త‌మ‌కు వ‌చ్చిన స‌న్నివేశం క‌నిపిస్తే వెంట‌నే స్పూఫ్ వీడియో చేయ‌డం దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం జ‌రుగుతుంది. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియోలు హ‌ల్ చ‌ల్ చేయ‌గా, తాజాగా రామ‌రాజు ఫ‌ర్ భీమ్ కు సంబంధించిన స్పూఫ్ వీడియో అంత‌ర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

వంశీ అనే కుర్రాడు కొమురం భీమ్‌లా మారి త‌న సిక్స్ ప్యాక్‌తో పాటు న‌ట‌న‌తోను అద‌రగొట్టాడు. గొండు గిరిజనులు క‌లిసి చేసిన ఈ వీడియోలో చివ‌ర‌కు టోపి తొల‌గించాల‌ని రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇపుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఒలివీయా మోరిస్, అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.


VIDEOS

logo