మ‌హాబ‌లేశ్వ‌రంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్..వీడియో

Dec 03, 2020 , 20:47:10

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ష‌న్ లో ఆర్ఆర్ఆర్ తెరెకెక్కుతున్న విష‌యం తెలిసిందే. రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ను బీఏ రాజు ట్విట‌ర్ షేర్ చేశారు. క‌ర్ణాట‌క మ‌హేబ‌ళేశ్వ‌రంలోని అంద‌మైన లొకేష‌న్ లో షార్ట్ షెడ్యూల్ షూట్ కొన‌సాగుతుంది. ఎత్తైన కొండప్రాంతాల మీదుగా డ్రోన్ కెమెరాల సాయంతో ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. 

చారిత్రక, కాల్పనిక అంశాల కలబోతగా వ‌స్తోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజ‌య్ దేవ్ గ‌న్, శ్రియ, అలియాభ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD