మహాబలేశ్వరంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్..వీడియో

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ తెరెకెక్కుతున్న విషయం తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ను బీఏ రాజు ట్విటర్ షేర్ చేశారు. కర్ణాటక మహేబళేశ్వరంలోని అందమైన లొకేషన్ లో షార్ట్ షెడ్యూల్ షూట్ కొనసాగుతుంది. ఎత్తైన కొండప్రాంతాల మీదుగా డ్రోన్ కెమెరాల సాయంతో ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
చారిత్రక, కాల్పనిక అంశాల కలబోతగా వస్తోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజయ్ దేవ్ గన్, శ్రియ, అలియాభట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace for #RRRMovie #RRRDiaries @ssrajamouli @DVVMovies @RRRMovie pic.twitter.com/fKGEbcIFxb
— BARaju (@baraju_SuperHit) December 3, 2020
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
- పీఈటీల అప్గ్రేడేషన్ చేపట్టాలి
- మహా మానవహారానికి మద్దతు
- వ్యాక్సినేషన్ కేంద్రాల పెంపు
- నిజాంసాగర్ డీ-40 కాలువ పరిశీలన