శనివారం 11 జూలై 2020
Cinema - Jun 01, 2020 , 14:26:49

ఈ వారంలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్..!

ఈ వారంలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్..!

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు రెండు నెల‌ల నుండి సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ మూత‌ప‌డ్డాయి. వినోద ప‌రిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. సినీ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మంచి రోజుల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వారికి  శుభ‌వార్త అంద‌నున్న‌ట్టు తెలుస్తుంది.  క‌రోనా హెల్త్ గైడ్‌లైన్స్ పాటిస్తూ జూన్ నుండి షూటింగ్ జ‌రుపుకునేలా ఉత్త‌ర్వులు రానున్నాయ‌ని ఇటీవ‌ల‌ ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా ప్రచారం జరిగింది.

కొన్ని రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే షూటింగ్‌లు మొద‌లు కాగా, ఈ వారంలో తెలుగు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశాడ‌ట రాజ‌మౌళి.  ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వ‌స్తుందా అనే దానిపై అంద‌రిలో అనుమానాలు నెలకొన్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు


logo