శనివారం 29 ఫిబ్రవరి 2020
రాజ‌మౌళి నిర్ణ‌యంతో డైల‌మాలో ప‌డ్డ చిరు ..!

రాజ‌మౌళి నిర్ణ‌యంతో డైల‌మాలో ప‌డ్డ చిరు ..!

Feb 14, 2020 , 08:47:46
PRINT
రాజ‌మౌళి నిర్ణ‌యంతో డైల‌మాలో ప‌డ్డ చిరు ..!

బాహుబ‌లి త‌ర్వాత తెలుగులో మ‌ళ్లీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో చిత్రం విడుద‌ల కావ‌లసి ఉన్న‌ప్ప‌టికి, ప‌లు కార‌ణాల వ‌ల‌న వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 8కి చిత్రం పోస్ట్ పోన్ అయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం జ‌న‌వ‌రిలో విడుద‌ల కావ‌డం, చిరు సినిమా టీంకి కాస్త త‌ల‌నొప్పిగా మారింది. అందుకు కార‌ణం ఆర్ఆర్ఆర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే ముందు రాజ‌మౌళి ఇద్ద‌రు హీరోల‌తో ఓ అగ్రిమెంట్ చేయించుకున్నాడ‌ట‌. ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కంటే ముందు ఇద్ద‌రి సినిమాలు ఏవి రిలీజ్ కాకూడ‌ద‌ని ఒప్పందం చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి చిరు చిత్రం ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేయాల‌ని భావించ‌గా, ఒప్పందం ప్ర‌కారం జ‌న‌వ‌రి వ‌ర‌కు ఈ చిత్రం రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మేనా అనే అనుమానం అభిమానుల‌లో క‌లుగుతుంది. చిరు 152వ‌ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కామియో రోల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. 


logo