మంగళవారం 26 మే 2020
Cinema - Mar 25, 2020 , 13:39:09

రౌద్రం,ర‌ణం, రుధిరం(RRR)..మోష‌న్ పోస్ట‌ర్

రౌద్రం,ర‌ణం, రుధిరం(RRR)..మోష‌న్ పోస్ట‌ర్

ఎట్ట‌కేల‌కి దాహంతో ఉన్న అభిమానుల దాహ‌ర్తిని తీర్చాడు రాజ‌మౌళి. కొన్నాళ్ళుగా ఆర్ఆర్ఆర్ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. హీరోల బ‌ర్త్‌డేల‌కి, పెద్ద పండుగ‌ల‌కి కూడా ఎలాంటి పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌ని రాజ‌మౌళి ఉగాది సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశాడు. ‘రౌద్రం, రణం, రుధిరం’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

మోష‌న్ పోస్ట‌ర్‌లో రామ్ చరణ్‌ ‘రౌద్రం’, ఎన్టీఆర్ ‘రుధిరం’ కలిసి ‘రణం’గా మారింది. నీరు నిప్పుని ఆర్పుతుంది. అదే నిప్పు నీటిని ఆవిరి చేస్తుంది. ఈ రెండు బ‌లాలు క‌లిసి మ‌హాశ‌క్తిగా మ‌న‌ముందుకు రాబోతున్నాయి అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మోషన్ పోస్టర్లను ఒకేసారి విడుదల చేశారు.  ఈ సినిమా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.logo