దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్13న చిత్రాన్ని విడుదల చేయనున్న నేపథ్యంలో మేకర్స్ షూటింగ్ స్పీడ్ పెంచారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలోని ప్యాచ్ వర్క్‌తో పాటు పాటల కోసం ఉక్రెయిన్‌కు వెళ్లారు. అక్కడ ఆర్ఆర్ఆర్ టీమ్ లాండ్ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ షెడ్యూల్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తంగా పూర్తి కానుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం.
ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రీసెంట్గా చిత్రానికి సంబంధించి దోస్తి అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. రానున్న రోజులలో చిత్రానికి సంబంధించిన పాటలను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండగా, డీవీవీ దానయ్య నిర్మాతగా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.