శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 10:29:08

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు ఏర్పాట్లు..క్వారంటైన్‌లో స్టార్స్

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు ఏర్పాట్లు..క్వారంటైన్‌లో స్టార్స్

బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమాకు క‌రోనా బ్రేక్ వేసింది. షూటింగ్స్‌కి ప్ర‌భుత్వం నుండి అనుమతి లభించినా కరోనా ఉదృతి తగ్గలేదని ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకా మొద‌లు పెట్ట‌లేదు. అయితే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి అక్టోబర్ నెలాఖరులో  తిరిగి చిత్ర షూటింగ్ జ‌రిపేలా స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

షూటింగ్స్‌కు హాజ‌ర‌వ్వాలి అంటే క్వారంటైన్‌లో ఉండ‌డంతో పాటు టెస్ట్ చేయించుకోవాల‌నే నిబంధ‌న‌లు పెట్టార‌ట‌. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి నటీనటులందరినీ  క్వారంటైన్‌లో ఉండాలని రాజమౌళి సూచించినట్లు తెలుస్తోంది. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ పూర్త‌య్యాక మిగ‌తా పార్ట్ షూటింగ్‌ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తార‌ట‌.  వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్ధంలో సినిమాని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో జ‌క్క‌న్న ఉన్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నారు. అతి త్వ‌ర‌లో చిత్రం నుండి ఎన్టీఆర్‌కు సంబంధించి ప్రోమో విడుద‌ల కానుంద‌ని టాక్. 


logo