సోమవారం 25 మే 2020
Cinema - Mar 25, 2020 , 19:05:32

‘కరోనా’ నుంచి కాస్త ఉపశాంతినిచ్చిన ‘ఆర్ఆర్ఆర్’..

‘కరోనా’ నుంచి కాస్త ఉపశాంతినిచ్చిన ‘ఆర్ఆర్ఆర్’..

కొద్ది రోజులుగా ప్రపంచంలోని జనాభా అంతా పఠిస్తున్న నామం ‘కరోనా’. ఈ మహమ్మారి ఎక్కడో పుట్టి.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని జనం అంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభుత్వాలు కూడా జనాల్ని ఈ వైరస్ నుంచి ఎలా కాపాడాలా? అని కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా జనాలను బయటికి రానీయకుండా చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ కరోనా వైరస్ నామకరణం నుంచి కాస్త ఉపశాంతి లభించింది. అదెలా అనుకుంటున్నారు కదా..!

 దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అని ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ చిత్రానికి ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారా? అని అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘రౌద్రం రుధిరం ర‌ణం’ (ఆర్ఆర్ఆర్) అనే టైటిల్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉండటంతో.. జనాలందరికీ ఇది కాస్త రిలీఫ్ ఇచ్చినట్లుగా అయింది. నీరు, నిప్పు కాంబినేషన్‌ని కలిపి చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్.. వెయిట్ చేస్తున్న అందరినీ ఎంతగానో అలరించింది. కరోనా భయానికి కాస్త ఉపశాంతిని ఇచ్చింది అనేలా చేయగలిగింది.


logo