శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 17:11:33

జ‌క్క‌న్న‌, తార‌క్ తో 'ఆర్ఆర్ఆర్' చైల్డ్ ఆర్టిస్టులు..ఫొటోలు వైర‌ల్‌

జ‌క్క‌న్న‌, తార‌క్ తో 'ఆర్ఆర్ఆర్' చైల్డ్ ఆర్టిస్టులు..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..(రౌద్రం..ర‌ణం..రుధిరం). రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాలో క‌థానుగుణంగా  లీడ్ రోల్స్ పోషిస్తున్న తార‌ల చిన్న‌నాటి పాత్ర‌లు కూడా వ‌స్తాయి. మ‌రి ఈ పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నేదే క‌దా మీ సందేహం. కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నుండ‌గా..చిన్న‌నాటి రోల్ లో చ‌క్రి, రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నుండ‌గా..చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను వ‌రుణ్ బుద్ద‌దేవ్‌, అలియాభ‌ట్ సీత పాత్ర‌లో స్పంద‌న చ‌తుర్వేది న‌టిస్తున్న‌ట్టు తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. లొకేష‌న్ లో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌, రాజ‌మౌళితో ఈ ముగ్గురు చిన్నారులు దిగిన ఫొటోలను..స్పంద‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

సుమారు 400 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా..శ్రియ మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. 


View this post on Instagram

Beautiful memories while shooting for RRR. ???? Blessed

A post shared by Spandan Chaturvedi Official (@spandan_chaturvedi_the_real_me) on

View this post on Instagram

With Ramcharan Sir....in Hyderabad...... RRR .......

A post shared by Spandan Chaturvedi Official (@spandan_chaturvedi_the_real_me) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo