ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 00:21:42

మహాబలేశ్వరంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌'

మహాబలేశ్వరంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌'

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌' (రౌద్రం రణం రుధిరం). దాదాపు 400కోట్ల వ్యయంతో నిర్మాత డి.వి.వి.దానయ్య తెరకెక్కిస్తున్నారు. అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. ఈ చిత్రంలో తొలితరం స్వాతంత్య్రయోధులు కొమురం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాల్గొంటున్నారని చిత్రబృందం ప్రకటించింది. ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసిన వీడియోలో మహాబలేశ్వరంలోని పర్వతపంక్తులు, ప్రకృతి అందాల నడుమ ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌లపై క్రేన్‌,  డ్రోన్లను ఉపయోగించి కొన్ని  ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. 2021లో తెలుగు,  హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.