బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 21:35:38

హాస్పిటల్‌లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..పాపం రెస్ట్ లేక..

హాస్పిటల్‌లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..పాపం రెస్ట్ లేక..

బాలీవుడ్‌లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా కొందరు పేర్లు మాత్రం వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా అందులో అలియా భట్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపిక పదుకొనే లాంటి వాళ్లు కాస్త వెనకబడటంతో కుర్ర హీరోయిన్లు ముందుకొస్తున్నారు. అందులో అందరికంటే ముందుకు అలియా భట్ వస్తుంది. ఈమె వరస సినిమాలతో దూసుకుపోతుంది ఇప్పుడు. అందులోనూ అలియా చేతిలో అన్నీభారీ సినిమాలే ఉండటం గమనార్హం. తెలుగులోనూ ట్రిపుల్ ఆర్ లాంటి సంచలన సినిమాలో నటిస్తుంది అలియా భట్. 

అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఉన్నట్లుండి హాస్పిటల్ పాలైంది. దాంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది అలియా. దానికితోడు ఆ మధ్య లాక్ డౌన్ కారణంగా సినిమాలు ఒక్కసారిగా ఆగిపోవడం.. ఇప్పుడు అన్నీ ఒకేసారి మొదలవ్వడంతో పని ఒత్తిడి దారుణంగా పెరిగిపోయింది ఈ భామపై. పగలు రాత్రి తేడా లేకుండా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తుంది అలియా భట్. డేట్స్ అడ్జస్ట్ చేస్తూ.. అన్ని షూటింగ్స్ చేస్తుంది అలియా. 

లాక్ డౌన్ తర్వాత ‘బ్రహ్మాస్త్ర’తో పాటు సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూభాయ్’ సినిమాను కూడా మొదలుపెట్టింది అలియా భట్. ఆ సినిమా షూటింగ్ కాస్త జరిగిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో పాల్గొంది. ఆ వెంటనే మళ్ళీ ముంబై వెళ్లి ‘గంగూభాయ్’ షూటింగ్‌లో పాల్గొంది. ఇలా ఒకటి రెండు కాదు వరస సినిమాల షూటింగ్ తో అలియాకు విశ్రాంతి లేకుండా పోయింది. దాంతో అలిసిపోయి నిద్రలేమి వల్ల అనారోగ్యం పాలైంది. దీంతో ఒకరోజు హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వచ్చింది. ఒక రోజంతా చికిత్స తీసుకున్న తర్వాత ‘గంగూభాయ్’ సెట్‌లో అడుగు పెట్టింది అలియా భట్. అది పూర్తవగానే ఫిబ్రవరిలో RRR షూటింగ్‌లో అడుగు పెట్టనుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

శింబును వెలేసిన నిర్మాతల మండలి..?

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo