e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ‌ణుకు పుట్టిస్తున్న సెంటిమెంట్

ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ‌ణుకు పుట్టిస్తున్న సెంటిమెంట్

ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ‌ణుకు పుట్టిస్తున్న సెంటిమెంట్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ.. ఇటీవలే పది భాషల మూవీ హక్కులను అమ్మేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలకి చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది.

అలానే దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ వారు చేజిక్కించుకోగా.. హిందీ శాటిలైట్ ‘జీ సినిమా’ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుందేమో అని సినీ అభిమానులు భయపడుతున్నారు.జీ గ్రూప్ వారు సొంతం చేసుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాపులుగానే మిగిలాయి. స్పైడ‌ర్, రాధే వంటి చిత్రాలు జీ గ్రూపు వారు కొన‌గా, ఇప్పుడు ఆర్ఆర్‌ని కూడా సొంతం చేసుకున్నారు. మరి దర్శకధీరుడి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ముందు జీ5 బ్యాడ్ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్‌ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్‌
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని
స్టార్‌ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్‌ 9 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ‌ణుకు పుట్టిస్తున్న సెంటిమెంట్

ట్రెండింగ్‌

Advertisement