దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న సినిమా పెండ్లి సందD (Pelli SandaD). శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan Meka) హీరోగా నటిస్తోండగా..శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘పట్టు చీరలా తలతలలు పట్టగొలుసులా గళగళలు..పూల చొక్కలా రెపరెపలు సిక్కు పంచెలా టపటపలు’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
కుటుంబ సభ్యులందరి సమక్షంలో చాలా సందడి వాతావరణంలో సాగుతున్న ఈ పాట.. రోషన్, శ్రీలీలతోపాటు మిగిలిన నటీనటులందరితో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా పాడారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవేంద్రరావు వశిష్ట పాత్రలో తొలిసారి యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారు.
ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వస్తున్న ఈ మూవీ పాటలు మంచి హిట్ గా నిలవడం ఖాయమని రషెస్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే బుజ్జులు బుజ్జులు అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్