బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 11:26:03

పెళ్లి సంద‌డి హీరో ఎవ‌రో చెప్పేశారు!

పెళ్లి సంద‌డి హీరో ఎవ‌రో చెప్పేశారు!

1996లో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు తెర‌కెక్కించిన పెళ్లి సంద‌డి చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇప్పుడు మ‌రోసారి అదే పేరుతో చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యారు. శ్రీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం విశేషప్రజారదణ పొంద‌డంతో పాటు కమర్షియల్‌గా భారీ విజయం సాధించింది. కీరవాణి స్వరపరచిన ఈ చిత్రగీతాలు సంగీతప్రియుల్ని ఎంతగానో మెప్పించాయి.

ఇటీవ‌ల‌ ‘పెళ్లిసందడి’ పేరుతో రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించారు. ఆర్కా మీడియా వర్క్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాధామోహనరావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరరచన చేయనుండగా చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్‌. శ్రీకాంత్ త‌నయుడు రోష‌న్ హీరోగా చిత్రం రూపొంద‌నుంద‌ని, చెబుతూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో రోష‌న్ లుక్ చాలా బాగుంది. ఇక ఈ చిత్రాన్ని కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనాంకి  దర్శకత్వం వహించనున్నారు. చిత్ర క‌థానాయిక ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉంది.