అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా నటిస్తున్న సినిమా ‘రూమ్’. అశ్విన్, రమేష్ కె సమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై వీఎస్ సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పద్మమగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ…‘ఎన్నో ఏళ్లుగా పంపిణీరంగంలో ఉన్నాను. ఎక్కువగా చిరంజీవి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ కథ బాగా నచ్చడంతో సినిమాను నిర్మిస్తున్నాను. యూత్ ఫుల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. అసభ్యత లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. 60 శాతం చిత్రాన్ని ఒక గదిలో చిత్రీకరించాం. త్వరలోనే మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.