ఆకాష్పూరి, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ప్లే సంభాషణలు అందిస్తూ ఛార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ పాదురి దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తయింది. ‘యు.ఎ’ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట ప్రణయప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. ఆకాష్పూరి పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది. థియేటర్స్లో ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. రమ్యకృష్ణ, మకరంద్దేశ్పాండే, ఉత్తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: నరేష్.