మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 00:03:24

రొమాంటిక్‌ హనీ ట్రాప్‌

రొమాంటిక్‌ హనీ ట్రాప్‌

సాయిఋషి, తేజు అనుపోజు జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీట్రాప్‌'. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. వామనరావు నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభంకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది దర్శకుడు మాట్లాడుతూ ‘పట్టణ నేపథ్యంలో సాగే  రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నా శైలి హంగులకు కమర్షియల్‌ అంశాలను జోడించి రూపొందించబోతున్నాను.  వైజాగ్‌, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. డిసెంబర్‌ 15లోగా షూటింగ్‌ను  పూర్తిచేసి సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తూ తాను నిర్మిస్తున్న చిత్రమిదని, యూనివర్సల్‌ పాయింట్‌తో తెరకెక్కనుందని నిర్మాత చెప్పారు. సత్యానంద్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నానని హీరో సాయిఋషి చెప్పారు. ఈ కార్యక్రమంలో తేజు, శివకార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.