‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా ఇది. సన్నివేశాలు, విజువల్స్ అన్నీ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి’ అన్నారు ఎం.ఎస్.రాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘7డేస్ 6నైట్స్’. సుమంత్ అశ్విన్, మోహర్ చాహల్, రోహన్, క్రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘గోవా, మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ పూర్తిచేశాం. ఈ సినిమా ద్వారా మా అబ్బాయిని నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. రెండు జంటలు ఏడు రోజుల్లో చేసిన అందమైన ప్రయాణానికి దృశ్యరూపంలా ఈ సినిమా ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించి రికార్డు సమయంలో షూటింగ్ పూర్తిచేశామని, తమ బ్యానర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: సమర్థ్ గొల్లపూడి, నిర్మాణ సంస్థ: వైల్డ్హనీ ప్రొడక్షన్, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.