e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home సినిమా యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..

యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..

యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..

బాలీవుడ్‌ దిగ్గజ రచయిత ద్వయం సలీమ్‌ఖాన్‌, జావెద్‌ అక్తర్‌ జీవితాల ఆధారంగా ఓ డాక్యుమెంటరీ తెరకెక్కబోతున్నది. సినీ రచయితలకు స్టార్‌స్టేటస్‌ను తీసుకురావడంతో పాటు హిందీ చిత్రసీమలో గొప్ప స్క్రీన్‌రైటర్స్‌గా పేరుపొందిన సలీమ్‌, జావెద్‌ 24 చిత్రాలకు కలిసి పనిచేశారు. 1970-80 దశకంలోని బాలీవుడ్‌ చిత్రసీమ తీరుతెన్నులతో పాటు సలీమ్‌-జావెద్‌ల జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ రూపొందించబోతున్న ఈ డాక్యుమెంటరీకి ‘యాంగ్రీ యంగ్‌మెన్‌’ అనే పేరును ఖరారు చేశారు. దీనికి నమ్రతా రావు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ డాక్యుమెంటరీకి సలీమ్‌ఖాన్‌ తనయుడు, అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌, జావెద్‌ అక్తర్‌ కొడుకు ఫర్హాన్‌ అక్తర్‌, కూతురు జోయాఅక్తర్‌ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఇద్దరు అగ్రరచయితల జీవితాలపై రూపొందిస్తున్న డాక్యుమెంటరీకి వారి తనయులు నిర్మాతలుగా వ్యవహరించనుండటం బాలీవుడ్‌లో ప్రాముఖ్యతని సంతరించుకున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..
యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..
యాంగ్రీయంగ్‌మెన్‌ జీవితాలతో..

ట్రెండింగ్‌

Advertisement