సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 23:39:16

ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత

ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘రోజా’ చిత్రంలో అరవిందస్వామి, మధుబాల జంటగా నటించారు. దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల విరామం తర్వాత వీరిద్దరు మళ్లీ జోడీకట్టబోతున్నారు. ‘తలైవి’ చిత్రంలో అరవిందస్వామి, మధుబాల భార్యాభర్తలుగా నటించబోతున్నారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తోంది. ఎంజీఆర్‌ పాత్రను అరవిందస్వామి పోషిస్తున్నారు. ఆయన భార్య జానకి పాత్రకోసం  మధుబాలను చిత్రబృందం తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ఏ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 


logo