సిక్స్టీన్స్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన రోహిత్ కొంత విరామం తరువాత నటిస్తున్న చిత్రం ‘కళాకార్’. శ్రీను బందెల దర్శకుడు. వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. హీరో రోహిత్ మాట్లాడుతూ ‘తొలిసారిగా యాక్షన్ అండ్ సస్పెన్స్ కథతో చేస్తున్న చిత్రమిది.పోలీస్‌ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాను. తప్పకుండా ఈ చిత్రం నా సెకండ్ఇన్నింగ్స్కు మంచి శుభారంభాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు. షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్‌కనకాల, శివశంకర్, రవికాలే తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి సంగీతం: కనిష్క.