శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 08:20:35

త‌న‌కి నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలిపిన ప్ర‌ముఖ నిర్మాత‌

త‌న‌కి నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలిపిన ప్ర‌ముఖ నిర్మాత‌

డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాత‌గా ప‌లు భాష‌ల‌లో ప‌ని చేసిన రాక్‌లైన్ వెంక‌టేష్ క‌రోనా బారిన ప‌డ్డార‌ని గురువారం జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. సుమ‌ల‌త‌తో క‌లిసి సీఎంని క‌ల‌వ‌డానికి వెళ్లిన నేప‌థ్యంలో రాక్‌లైన్ వెంక‌టేష్‌కి క‌రోనా సోకింద‌ని వదంతులు వ్యాపించాయి. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టుగా కూడా వార్త‌లు రాగా, దీనిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

ప్ర‌స్తుతం నేను క్షేమంగానే ఉన్నాను. వైద్య ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా నెగెటివ్ వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌రోనా బారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయన సూచించారు. ఇక క‌ర్ణాట‌క చిత్ర వాణిజ్య‌మండ‌లి కూడా  సినీ నటులు, బుల్లితెర నటులు తమ ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైన మేరకు అభిమానులు ఎవ్వరినీ భేటీ కావద్దని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo