సుమంత్ రెండో పెళ్లి తాలూకు వార్త ఈ మధ్య సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పేరుతో ఉన్న వెడ్డింగ్ కార్డ్ హల్చల్ చేసింది. అయితే తన పెళ్లి విషయంలో సుమంత్ ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చారు. తాను పెళ్లి చేసుకోవడం లేదని, తన తాజా సినిమా తాలూకు వెడ్డింగ్ కార్డ్ ఆన్లైన్లో లీకైన కారణంగా పెళ్లి పుకార్లను సృష్టించారని సుమంత్ తెలిపారు. తాజాగా ఈ సినిమాకు ‘మళ్లీ మొదలైంది’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. పెళ్లి, దాంపత్యం, విడాకులు అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. నైనా గంగూలీ కథానాయిక. శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడాకుల తర్వాత జీవితాన్ని సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, రచన-దర్శకత్వం: టీజీ కీర్తికుమార్.