మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 23:35:20

ఓటీటీలో నయనతార సినిమా

ఓటీటీలో నయనతార సినిమా

లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల పాటు మూతపడిన థియేటర్లు ఈ నెల పదిహేను నుంచి తెరచుకోనున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో  తమ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయడానికి వివిధ భాషలకు చెందిన నిర్మాతలు మాత్రం సంశయిస్తున్నారు. కొందరు  ఓటీటీవైపు మొగ్గుచూపుతున్నారు.  అగ్ర నటీనటుల చిత్రాలను ఓటీటీ ద్వారానే విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా నయనతార నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌' ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భక్తి ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించబోతున్నది. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటుడు ఆర్‌.జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.   దీపావళి సందర్భంగా ఓటీటీలో ఈ సినిమా విడుదలకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న విడుదలకావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడింది. logo