శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 13, 2020 , 08:31:59

సంస్మ‌ర‌ణ స‌భ‌లో రిషీ క‌పూర్ కూతురు, త‌న‌యుడు

సంస్మ‌ర‌ణ స‌భ‌లో రిషీ క‌పూర్ కూతురు, త‌న‌యుడు

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ కపూర్ ఏప్రిల్ 30న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న కొద్ది మంది స‌మ‌క్షంలోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఇక కొద్ది రోజుల క్రితం సంస్మ‌ర‌ణ స‌భ జ‌రుప‌గా రిషీ భార్య నీతూ, త‌న‌యుడు ర‌ణ‌బీర్ క‌పూర్ భావోద్వేగంతో క‌నిపించారు. మంగ‌ళ‌వారం రోజు ఫ్యామిలీ ప్రార్ధ‌నా స‌మావేశం నిర్వ‌హించింది. అందుకు సంబంధించిన ఫోటోల‌ని రిద్దిమా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేసింది. 

ల‌వ్ యూ నాన్న‌.. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికి ప్రేమిస్తూ ఉంటాం అని తండ్రి ఫోటోతో దిగిన పిక్ షేర్ చేసిన రిద్ధిమా మ‌రో పోస్ట్‌లో త‌మ్ముడు ర‌ణబీర్ క‌పూర్‌తో దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి మీ వార‌సత్వం కొన‌సాగుతూనే ఉంటుంది. ల‌వ్ యూ నాన్న అని క్యాప్ష‌న్ ఇచ్చింది. రిషీ చ‌నిపోయిన‌ప్పుడు రిద్ధిమా ఢిల్లీలో ఉండ‌గా, తండ్రిని క‌డ‌సారి చూసేందుకు 1400కి.మీ రోడ్డు ప్ర‌యాణం చేస్తూ ముంబైకి చేరుకుంది. కాని అంత‌లోనే అంత్య‌క్రియ‌లు పూర్తి చేయ‌డంతో చివ‌రి చూపుకి నోచుకోలేక‌పోయింది రిద్ధిమా. logo