బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 15:19:44

తండ్రి మృతితో ఎమోష‌న‌ల్ అయిన‌ రిషీ కుమార్తె

తండ్రి మృతితో ఎమోష‌న‌ల్ అయిన‌ రిషీ కుమార్తె

దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ కుమార్తె రిద్దిమా క‌పూర్  ప్యాషన్‌ డిజైనర్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ‌ వ్యాపారవేత్త భరత్‌ సాహ్నిని పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే త‌న తండ్రి చ‌నిపోయార‌న్న విష‌యం తెలుసుకున్న రిద్ధిమా చాలా ఎమోష‌న‌ల్ అయింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫోటో షేర్ చేస్తూ భావోద్వేగ‌పు ట్వీట్ పెట్టింది. 

పాపా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను . నా బ‌ల‌మైన పోరాట యోధుడి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలి.  నేను ప్ర‌తి రోజు నిన్ను మిస్ అవుతాను,  ప్రతిరోజూ మీ ఫేస్ టైమ్ కాల్స్ మిస్ అవుతాను.  మీకు వీడ్కోలు చెప్పడానికి నేను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను! మళ్ళీ మ‌నం కలిసే వరకు పాపా ఐ లవ్ యు అని ట్వీట్ చేసింది రిద్ధిమా. లాక్‌డౌన్ వ‌ల‌న అధికారుల అనుమ‌తితో ఆమె రోడ్డు ప్ర‌యాణం ద్వారా ఢిల్లీ నుండి ముంబై వ‌స్తుంది. రిద్ధిమా ముంబై చేరుకున్న త‌ర్వాత రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. 


logo