గురువారం 28 మే 2020
Cinema - Apr 30, 2020 , 13:29:30

గ‌ట్టి పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు

గ‌ట్టి పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు

సినీవినీలాకాశంలో త‌ళుక్కున మెరిసిన తార రిషీ క‌పూర్ ఈ రోజు ఉద‌యం హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంతో అభిమానుల గుండెలు ప‌గిలాయి. కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.  రిషీ కపూర్ మ‌ర‌ణం భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటుగా మిగిలింది. సినిమా య‌వ‌నిక‌పై ఆయ‌న ఒక సంచ‌ల‌నం. సినీ ప‌రిశ్ర‌మ‌కి ఆయ‌న ఒక ఆణిముత్యం. 

రిషీ క‌పూర్‌ని చివ‌రి చూపు చూసేందుకు అభిమానులు,స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత‌గానో ప‌రిత‌పిస్తున్నారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంద‌రు ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటించాల‌ని రిషీ క‌పూర్ ఫ్యామిలీ కోరింది. ముంబైలోని చందన్‌వాడి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో గ‌ట్టి భ‌ద్ర‌త మ‌ధ్య రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు రేపు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కరోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో రిషీ క‌పూర్‌ని ఇంటికి తీసుకెళ్ల‌కుండా నేరుగా శ్మ‌శాన వాటికకి తీసుకెళ్ల‌మ‌ని ముంబై పోలీసులు అభ్య‌ర్ధించిన‌ట్టు తెలుస్తుంది.  


logo