బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 11:43:47

45 మంది హీరోయిన్ల‌తో న‌టించిన రొమాంటిక్ హీరో !

45 మంది హీరోయిన్ల‌తో న‌టించిన రొమాంటిక్ హీరో !

హైద‌రాబాద్‌: రిషీ క‌పూర్ టాలెంట్ మాత్ర‌మే కాదు. అత‌ని లుక్స్ కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయి.  అమ్మాయిల మ‌న‌సు దోచిన హీరో అత‌ను. రొమాంటిక్ హీరోగా రిషీ దాదాపు 25 ఏళ్లు చెల‌రేగిపోయాడు.  ఆ త‌ర్వాతే అత‌ను క్యారెక్ట‌ర్ రోల్స్‌కు ప్రాధాన్య‌త ఇచ్చాడు.  సుదీర్ఘ‌మైన అత‌ని కెరీర్‌లో.. ఎన్నో ల‌వ్లీ సాంగ్స్ ఉన్నాయి.  ఎంతో మంది హీరోయిన‌ట్ల‌తో అత‌ను సెప్టెలేశాడు. బాలీవుడ్‌లో రిషీకి ప్ర‌త్యేక హిస్ట‌రీ ఉన్న‌ది.  చాక్లెట్‌బాయ్ రిషీ సుమారు 45 మంది హీరోయిన్ల‌తో సినిమాలు తీసిన‌ట్లు తెలుస్తోంది.  యాక్ష‌న్ హీరోల‌తో పోటీగా రిషీ త‌న రొమాంటిక్ పాత్ర‌ల‌తో ఫిల్మ్ ల‌వ‌ర్స్‌ను ఇంప్రెస్ చేశాడు. త‌న కెరీర్‌లో టాప్‌గా వెళ్తున్న‌ స‌మ‌యంలో అప్పుడు ఉన్న‌ ప్ర‌తి ఒక్క మేటి యాక్ట‌ర్‌తో అత‌ను న‌టించాడు. త‌న క‌న్నా సీనియ‌ర్ల‌తోనూ క‌లిసి అత‌ను పాత్ర‌లు పోషించాడు. 

70 నుంచి 90 ద‌శ‌కం వ‌ర‌కు ఉన్న టాప్ హీరోయిన్ల‌తో కూడా రిషీ న‌టించాడు. ష‌బానా అజ్మీ, హేమా, రాఖీ, రేఖా, జ‌య‌ప్ర‌ద‌, మాధురీ దీక్షిత్‌, శ్రీదేవి, టీనా మునిమ్‌, ర‌వీనా టండ‌న్ లాంటి సీనియ‌ర్ల‌తో పాటు దివ్య‌భార‌తి లాంటి యువ న‌టితోనూ రిషీ మూవీలు చేశాడు. వీరంద‌రితోనూ అత‌ను రొమాంటిక్ పాత్రలు పోషించాడు. ఇక అరంగేట్రం చేసిన అనేక మంది హీరోయిన్ల‌తోనూ అత‌ను న‌టించాడు. డింపుల్ క‌పాడియా, రంజీతా, ప‌ద్మిని కొల్హాపూర్‌, షోమా ఆనంద్ లాంటి డెబ్యూ హీరోయిన్ల‌తోనూ రిషీ న‌టించాడు. 
logo