శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 12:19:24

డ‌బ్బుల్లేక‌ న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేశారు: రిషీ క‌పూర్

డ‌బ్బుల్లేక‌ న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేశారు:  రిషీ క‌పూర్

బాలీవుడ్ అగ్ర నటుడు రిషీ క‌పూర్ మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో బాల న‌టుడిగా వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆ చిత్రానికి గాను ఆయ‌న జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక 1973లో హీరోగా బాబీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. రిషీ తండ్రి రాజ్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రిషీ స‌ర‌స‌న డింపుల్ క‌పాడీయా క‌థానాయిక‌గా న‌టించింది.

బాబీ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రిషీ క‌పూర్.. బాబీ సినిమా నన్ను హీరోగా ప‌రిచ‌యం చేసిందని అంద‌రికీ తెలుసు. కాని ఆ సినిమాలో నేను హీరోగా నటించ‌డానికి కార‌ణం ఏమంటే.. మేరా నామ్ జోక‌ర్ సినిమా కోసం అయిన అప్పులు తీర్చేందుకు బాబీని తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. బాబీలో యువ క‌థానాయ‌కుడిని తీసుకోవాల‌ని భావించారు. రాజేశ్ ఖ‌న్నాని తీసుకోవాల‌నే కోరిక నాన్న‌కి బాగా ఉన్నా , డ‌బ్బులు లేక నాతో తీసారు . అలా తాను హీరో అయిన తీరుని ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు రిషీ


logo