గురువారం 28 మే 2020
Cinema - Apr 30, 2020 , 16:29:20

క‌ష్ట స‌మ‌యంలో సంజ‌య్ ద‌త్‌కి అండ‌గా నిలిచిన రిషీ

క‌ష్ట స‌మ‌యంలో సంజ‌య్ ద‌త్‌కి అండ‌గా నిలిచిన రిషీ

కొన్ని ద‌శాబ్ధాల పాటు హీరోగా వెండితెర‌ని ఏలిన అద్భుత న‌టుడు రిషీ క‌పూర్. మ‌ధ్య‌లో కొన్ని మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసిన ఆయ‌న ఇటీవ‌ల సైడ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌చ్చారు. అయితే న‌టుడిగానే కాకుండా మంచి మాన‌వ‌తా వాదిగా అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న రిషీ క‌పూర్.. మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్న‌  సంజయ్‌దత్‌కి చాలా అండ‌గా నిలిచార‌ట‌.  ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు సంజూభాయ్.

ప్రియ‌మైన చింటు సార్.. మీరు నా జీవితంలో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి. నాకు ఎంతో ఆద‌ర్శంగా నిలిచిన మీరు జీవితంలో ఎలా ఉండాలి, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియ‌జేశారు. మీతో నా పరిచ‌యం నా అదృష్టం. న‌న్ను ఎప్పుడు మంచి బాట‌లో న‌డిపించిన మీరు ఎంత క‌ష్టం వ‌చ్చిన కూడా చిరు న‌వ్వుతోనే జీవితాన్ని ముందుకు సాగించాలని చెప్పారు . అంద‌రిలో స్పూర్తి నింపిన మీరు క్యాన్స‌ర్‌తో చాలా బాగా ఫైట్ చేశారు. న్యూయార్క్‌లో ఉన్న స‌మ‌యంలోను మీతో మాట్లాడ‌గా, చాలా యాక్టివ్‌గా ఉన్నారు.

ఇటీవ‌ల ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు మీరు అనారోగ్యంతో ఉన్న‌ప్ప‌టికీ, నాపై చాలా శ్ర‌ద్ధ చూపారు. ఈ రోజు నాకు చాలా బాధాక‌ర‌మైన రోజు. నేను నా కుటుంబ వ్య‌క్తిని, స్నేహితుడుని, సోదరుడిని కోల్పోయాను.మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాను. దేవుడు మిమ్మల్ని స్వ‌ర్గంలో సంతోషంగా ఉంచుతాడని ఆశిస్తున్నాను. ఐ లవ్‌ యూ చింటూ సార్‌’’. అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే 2012లో వ‌చ్చిన రీమేక్ చిత్రం అగ్నీపథ్‌, సాహిబాన్‌ వంటి చిత్రాల్లో రిషి కపూర్‌, సంజయ్‌దత్‌ కలిసి  నటించారు


logo