గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 15:55:27

రిషీ క‌పూర్ 'బాబీ' చిత్రాన్ని 100 రోజులు ఆడించిన తెలుగు ప్రేక్ష‌కులు

రిషీ క‌పూర్ 'బాబీ' చిత్రాన్ని 100 రోజులు ఆడించిన తెలుగు ప్రేక్ష‌కులు

బాలీవుడ్ దిగ్గ‌జం రిషీ క‌పూర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం బాబీ. ఈ చిత్రాన్ని రిషీ క‌పూర్ తండ్రి రాజ్ క‌పూర్ నిర్మించి, తెర‌కెక్కించారు. 1973లో విడుద‌లైన ఈ రొమాంటిక్ చిత్రంలో రిషీ స‌ర‌స‌న డింపుల్ క‌పాడియా న‌టించారు. ఈ చిత్రం 1973లో అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన భార‌తీయ చిత్రంగా నిలిచింది. సోవియట్ యూనియన్‌లో ఒక విదేశీ బ్లాక్‌బస్టర్‌గా కూడా నిలిచింది. ఇక్కడ బాబీ చిత్రం 62.6 మిలియన్ల ప్రేక్షకులను ఆకర్షించింది.

ఆ స‌మ‌యంలో బాబీ చిత్రం ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారింది. బాలీవుడ్‌లో టీనేజ్ రొమాన్స్‌ని ప‌రిచ‌యం చేసింది. ఈ చిత్రం త‌ర్వాత చాలా చిత్రాలు ఈ మూవీని ప్రేర‌ణ‌గా తీసుకొని రూపొందాయి. ఇండియాటైమ్స్ ప్ర‌కారం 'టాప్ 25 తప్పక చూడవలసిన బాలీవుడ్ ఫిల్మ్స్'లో బాబీకి స్థానం కల్పించడం విశేషం. అయితే బాబీ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు కూడా తీసుకురాగా, ఇక్కడ వంద రోజులు ఆడ‌డం విశేషం. తాజాగా వంద రోజుల సినిమా పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. 

బాబీ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రిషీ క‌పూర్.. బాబీ సినిమా నన్ను హీరోగా ప‌రిచ‌యం చేసిందని అంద‌రికీ తెలుసు. కాని ఆ సినిమాలో నేను హీరోగా నటించ‌డానికి కార‌ణం ఏమంటే.. మేరా నామ్ జోక‌ర్ సినిమా కోసం అయిన అప్పులు తీర్చేందుకు బాబీని తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. బాబీలో యువ క‌థానాయ‌కుడిని తీసుకోవాల‌ని భావించారు. రాజేశ్ ఖ‌న్నాని తీసుకోవాల‌నే కోరిక నాన్న‌కి బాగా ఉన్నా , డ‌బ్బులు లేక నాతో తీసారు . అలా తాను హీరో అయిన తీరుని ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు రిషీ


logo