బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 12:43:04

నిఖిల్ బ‌ర్త్‌డే.. రైడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

నిఖిల్ బ‌ర్త్‌డే.. రైడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ జాగ్వార్ అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  బోల్తాకొట్ట‌డంతో కొన్నాళ్ళ పాటు టాలీవుడ్‌వైపు చూడ‌లేదు. ఇక ఇప్పుడు ‌ తన నాలుగో చిత్రంగా   తెలుగులో రైడ‌ర్ అనే  స్ట్రయిట్‌ చిత్రం చేస్తున్నారు నిఖిల్ కుమార్ . ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు.  

భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న రైడ‌ర్  సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఈ రోజు నిఖిల్ కుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రైడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా యాక్షన్ మోడ్‌తో క‌నిపిస్తున్నారు.  నిఖిల్‌ కుమార్‌ సరసన ఈ చిత్రంలో క‌శ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది. అతి త్వ‌ర‌లోనే మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.


VIDEOS

logo