మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 17:39:56

ప‌రారీలో రియా..ఎస్పీని మిన‌హాయించండి: బీహార్ డీజీపీ

ప‌రారీలో రియా..ఎస్పీని మిన‌హాయించండి: బీహార్ డీజీపీ

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి కేసులో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేర‌కు బీహార్ పోలీసులు సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితోపాటు మ‌రో ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే అప్ప‌టి నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌రారీలో ఉంది. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న రియా చ‌క‌వ్ర‌ర్తి అభ్య‌ర్థ‌ను కొట్టిపారేస్తూ..సుప్రీంకోర్టు ఇవాళ సుశాంత్ కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు అంగీక‌రించింది. దీంతో రియా చ‌క్రవ‌ర్తి ద‌ర్యాప్తులో పాట్నా పోలీసుల పాత్ర కీల‌కం కానుంది. 

ఈ నేప‌థ్యంలో బీహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే మాట్లాడుతూ..రియా చ‌క్ర‌వ‌ర్తి మాకు ట‌చ్ లో లేరు. పరారీలో ఉన్నారు. విచార‌ణ‌కు ఆమె ముందుకు రావ‌డం లేదు. ఆమె ముంబై పోలీసులతో కూడా ట‌చ్ లో ఉన్నారా..?  లేదా ? అనే దానిపై ఎలాంటి స‌మాచారం లేదు. ముంబైకి వ‌చ్చిన పాట్నా ఎస్పీ వినయ్ తివారీని క్వారంటైన్ పేరుతో బ‌ల‌వంతంగా ఐసోలేష‌న్ లో ఉంచ‌డం సరికాద‌ని డీజీపీ అన్నారు. ప్ర‌స్తుత ప‌రిణామాల దృష్ట్యా ఐపీఎస్ అధికారి విన‌య్ తివారీకి మిన‌హాయింపు క‌ల్పించి..క‌నీసం పాట్నాకు తిరిగి పంపించాల‌ని బీఎంసీకి విజ్ఞ‌ప్తి చేశారు. ఇది వృత్తిప‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌న కాద‌న్నారు. విన‌య్ తివారీ ఓ ఐపీఎస్ ఆఫీస‌ర్ అని, అరెస్ట్ చేసిన‌పుడు నిర్బంధంలో ఉంచిన‌ట్టు ఇలా క్వారంటైన్ లో పెట్డ‌డం స‌రైంది కాద‌న్నారు. 

సిబిఐ విచారణ కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టు ముందు పేర్కొన్నారు. దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయమని ఆదేశిస్తూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను విచారించిన‌ సుప్రీం కోర్టు ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo