ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 15:04:37

సుశాంత్ గార్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేసి చంపుతామంటూ బెదిరింపులు

సుశాంత్ గార్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేసి చంపుతామంటూ బెదిరింపులు

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం అభిమానుల‌కి పీడ‌క‌ల‌గా మారింది. ఆయ‌న మ‌ర‌ణాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. బాలీవుడ్‌లో ఉన్న కొంద‌రు ప్ర‌ముఖుల వ‌ల‌న‌నే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వారిని ఎండ‌గ‌డుతున్నారు. విప‌రీతంగా ట్రోల్ చేస్తూ కంటిపై నిద్ర‌లేకుండా చేస్తున్నారు . మ‌రి కొంద‌రేమో ఏకంగా చంపేస్తామంటూ బెద‌రింపుల‌కి దిగుతున్నారు.

సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా సుశాంత్ మ‌ర‌ణానికి కారణం అని అభిమానులు మండిప‌డుతున్నారు. సుశాంత్ మ‌ర‌ణించి నెల రోజులు పూర్తైన సంద‌ర్భంగా రియా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్ట‌డంతో వారు ఆమెని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులకి దిగారు. నువ్వు చ‌చ్చిపో లేదంటే ఏదో ఒక రోజు మేమే చంపేస్తాం అని ట్వీట్ చేశారు. ఈ విష‌యాన్ని రియా త‌న సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రి దృష్టికి తీసుకొచ్చింది.

"న‌న్ను గోల్డ్ డిగ్గ‌ర్ అన్నారు, స‌హించాను. హంత‌కురాల‌ని అన్నారు సైలెంట్‌గా ఉన్నాను. సిగ్గు లేద‌ని తిట్టారు భ‌రించాను. కాన ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోక‌పోతే నన్ను రేప్ చేసి చంపేస్తామ‌ని బెదిరించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. అస‌లు మీకు ఎవ‌రు ఈ అధికారం ఇచ్చారు. ఇది ఎంత‌ పెద్ద నేర‌మో మీకు అర్ధ‌మ‌వుతుందా? ఇలాంటి చెత్త ప‌నులు మానుకోండి. జ‌రిగిన‌వి చాలు..ఇక ఆపేయండి అంటూ రియా త‌న పోస్ట్‌లో పేర్కొంది. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ని కూడా ట్యాగ్ చేసిన రియా వారిపై చ‌ర్య‌లు తీసుకోమ‌ని కోరింది .logo