గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 14:56:13

సుశాంత్ కేసు.. ఈనెల 9 వ‌ర‌కు ఎన్‌సీబీ క‌స్ట‌డీలో రియా సోద‌రుడు

సుశాంత్ కేసు.. ఈనెల 9 వ‌ర‌కు ఎన్‌సీబీ క‌స్ట‌డీలో రియా సోద‌రుడు

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. డ్ర‌గ్స్ కోణాన్ని విచారిస్తున్న నార్కోటిక్స్ బ్యూరో.. ఇవాళ రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.  సెప్టెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు ఎన్‌సీబీ క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ శామ్యూల్ మిరాండాను కూడా 9వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీ కోరారు. జూన్ 14వ తేదీన సుశాంత్ త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  అనుమానాస్ప‌దంగా మారిన ఈ కేసును సీబీఐ విచారిస్తున్న‌ది. ఈడీ, ఎన్‌సీబీ కూడా ప‌లుకోణాల్లో ద‌ర్యాప్తు చేప‌డుతున్నాయి. కైజాన్ ఇబ్ర‌హీం అనే డ్ర‌గ్ వ్యాపారిని కూడా 14 రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కోణంలో ఇబ్ర‌హీం, జాయిద్ విల‌త్రా, అబ్దుల్ బాసిత్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్ కోసం గూగుల్ పే ద్వారా సామ్యూల్ మిరిండా డ‌బ్బులు చెల్లించిన‌ట్లు ఎన్‌సీబీ వ‌ర్గాలు ద్వారా వెల్ల‌డైంది. సామ్యూల్‌, శౌవిక్‌ల‌ను ఎన్‌సీబీ శుక్ర‌వారం అరెస్టు చేసింది. ఆ ఇద్ద‌రిపై నార్కోటిక్స్ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేశారు. logo