బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 12:57:16

నిన్ను కోల్పోయి నెల రోజులైన‌, జీవితాంతం ప్రేమిస్తుంటా: సుశాంత్ ప్రేయ‌సి

నిన్ను కోల్పోయి నెల రోజులైన‌, జీవితాంతం ప్రేమిస్తుంటా: సుశాంత్ ప్రేయ‌సి

సుశాంత్ లోకాన్ని విడిచి నేటితో నెల పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్‌తో దిగిన ఫోటోలని షేర్ చేస్తూ..ఆయ‌న‌తో గ‌డిచిన కాలాన్ని గుర్తు చేసుకుంది. నా భావోద్వేగాల‌ని ఎదుర్కోవ‌టానికి క‌ష్ట‌ప‌డుతున్నాను. నా హృద‌యంకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. నువ్వు ప్రేమ‌ని, దానికున్న శ‌క్తిని విశ్వ‌సించేలా చేశావు. జీవితాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో నేర్పించావు. నీ నుండి ఎంతో నేర్చుకున్నాను. నువ్వు ఇక నా ద‌గ్గ‌ర‌కి రావ‌ని తెలుసంటూ రియా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. 

నువ్వు ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశంలో ఉన్నావ‌ని నాకు తెలుసు. చంద్ర‌డు, న‌క్ష‌త్రాలు, గెలాక్సీలు భౌతిక శాస్త్ర‌వేత్త‌కి ఘ‌న స్వాగం ప‌లుకుతాయి . నీ మంచితనం, ఆనందంతో ప్ర‌తి దానిని నువ్వు అద్భుతంగా మార్చ‌గ‌ల‌వు. నీ కోసం ఆశ‌గా ఎదురు చూస్తుంటాను. నిన్ను నా ద‌గ్గ‌ర‌కి తీసుకురావాల‌ని అనుకుంటున్నాను. అందంతో పాటు అణుకువ గ‌ల వ్య‌క్తివి నువ్వు.ప్ర‌పంచం చూసిన అద్భుతం నువ్వు. మ‌న ప్రేమ‌ని మాట‌ల ద్వారా చెప్ప‌లేను. నీ ప్రేమ విశేష‌మైన‌ద‌ని నిరూపించావు. ద‌యాహృద‌యంతో ప్ర‌తీది ప్రేమిస్తుంటావు.  శాంతంగా ఉండు సుషీ. 30 రోజులు గడుస్తున్న‌ప్ప‌టికీ, జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీకు శాశ్వ‌తంగా క‌నెక్ట్ అయ్యాను. నీ పై నాకున్న ప్రేమ అనంతం, అంత‌కుమించి కూడా అని రియా త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు .


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo