మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 15:42:40

సుశాంత్ కేసు: రియాకు నార్కోటిక్స్ బ్యూరో స‌మ‌న్లు

సుశాంత్ కేసు:  రియాకు నార్కోటిక్స్ బ్యూరో స‌మ‌న్లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మాదకద్రవ్యాల కోణంలో రియా చక్రవర్తి తో పాటు ఆమె సోద‌రుడిని నార్కోటిక్స్ బ్యూరో విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిని ఇప్ప‌టికే క‌స్ట‌డీలోకి తీసుకున్న ఎన్సీబీ  సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు త‌మ క‌స్ట‌డీలో ఉంచ‌నున్నారు. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కోణంలో ఇబ్ర‌హీం, జాయిద్ విల‌త్రా, అబ్దుల్ బాసిత్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ శామ్యూల్ మిరాండాను కూడా 9వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీ కోరారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎన్‌సిబికి అప్పగించిన చాట్ రికార్డులలో రియా మాద‌క ద్రవ్యాల గురించి మాట్లాడిన‌ట్టు ఉండ‌డంతో ఎన్సీబీ అధికారులు ఆమెకు స‌మ‌న్లు జారీ చేశారు. రేపు ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు.  మ‌రోవైపు క‌స్ట‌డీలో ఉన్న శామ్యూల్‌, షోయిక్‌లు కొత్త వ్య‌క్తుల గురించి చెప్ప‌డంతో వారిని రిమాండ్‌లోకి తీసుకుంటున్నాం అని ఎన్సీబీ పేర్కొంది. కాగా, జూన్ 14న బాంద్రాలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుశాంత్ కేసుని  ఈడీ, ఎన్‌సీబీ ప‌లు కోణాల‌లో విచార‌ణ చేస్తుంది .


logo