బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బాలీవుడ్ (Bollywood) నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) మళ్లీ సినిమాలతో బిజీ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఈ భామ తాజా ఫొటోషూట్ (Photo shoot) తో తనపై గతంలో వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ ను మరిచిపోయేలా చేస్తోంది. హైదరాబాద్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల బెంగళూరు గాళ్ రియాచక్రవర్తిని తన కెమెరాలో బంధించాడు.
చమక్కుమని మెరుస్తున్న లెహెంగాలో పరిమితి ఆభరణాలను ధరించి, జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తుంది రియా చక్రవర్తి. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ…వేచి ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తున్న రియా చక్రవర్తికి మద్దతుగా నిలుస్తూ ఇండస్ట్రీ స్నేహితులు, అభిమానులు పోస్టులు పెట్టారు. అందంగా ఉన్నావ్ అని కనికా కపూర్ కామెంట్ పెట్టగా..అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేసింది. మీరు ట్రాక్ పైకి తిరిగొచ్చారు..అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టగా…మీకు మరింత శక్తి రావాలి మేడమ్ అంటూ కామెంట్ పెట్టాడు.
ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్ తో కలిసి చెహ్రే సినిమా చేయగా..విడుదల కోసం ఎదురుచూస్తోంది రియా చక్రవర్తి. ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి రూమి జాఫ్రీ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!