శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 18:00:23

నన్ను ఫాలో కావొద్దు..బాంద్రాలో రియాచ‌క్ర‌వ‌ర్తి..వీడియో వైర‌ల్‌

నన్ను ఫాలో కావొద్దు..బాంద్రాలో రియాచ‌క్ర‌వ‌ర్తి..వీడియో వైర‌ల్‌

బాలీవుడ్ న‌టి రియాచ‌క్ర‌వ‌ర్తి బాంద్రాలోని రోడ్డు ప‌క్క‌న ప్ర‌త్యక్ష‌మైంది.  బుధ‌వారం రియా చ‌క్ర‌వ‌ర్తి రోడ్డు ప‌క్క‌నున్న పూల షాప్ ద‌గ్గర ఆగి పూల బొకే కొనుగోలు చేసింది. రియా కారులో నుంచి దిగుతుండ‌గా గుర్తు ప‌ట్టిన కొంద‌రు ఆమెను ఫాలో అవ‌డం మొద‌లుపెట్టారు. త‌న‌ను ఫాలో కావొద్ద‌ని అక్క‌డున్న వారిని రిక్వెస్ట్ చేసింది. రియా పూల బొకే కొనుక్కుంటున్న‌పుడు అక్క‌డే ఉన్న వ్య‌క్తి తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

రియా పూలు కొన్న త‌ర్వాత కారు ద‌గ్గ‌ర‌కు వెళ్తుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్లు ఆమెను ఫాలో అయ్యారు. నేను వెళ్తున్నా..నా ద‌గ్గ‌ర‌గా రావొద్దంటూ రియా వారికి చెప్ప‌డం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు.  జ‌న‌వ‌రి 21న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జ‌యంతి సంద‌ర్భంగా రియా చ‌క్ర‌వ‌ర్తి పూలు కొంటున్న‌ద‌ని ప‌లువురు సుశాంత్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించ‌లేదు. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గ‌డిపిన త‌ర్వాత బెయిల్‌పై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo