శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 13:30:27

బాలీవుడ్ బ‌డా బాబుల పేర్లు బ‌య‌ట పెట్టిన రియా..!

బాలీవుడ్ బ‌డా బాబుల పేర్లు బ‌య‌ట పెట్టిన రియా..!

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సుశాంత్ గార్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని ఆదివారం ఆరు గంట‌ల పాటు విచారించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు సోమ‌వారం రోజు కూడా విచారిస్తున్నారు. అయితే విచార‌ణ‌లో రియా బాలీవుడ్ బిగ్గీస్‌కు సంబంధించి ప‌లువురు పేర్లు బ‌య‌ట‌పెట్టిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పుకొస్తుంది. ఆ పేర్లు ఏ సంద‌ర్భంలో ఆమె నోటి నుండి వ‌చ్చాయో తెలియాల్సి ఉంద‌ని బీటౌన్ మీడియా చెబుతుంది.

ఎన్సీబీ విచార‌ణ‌లో రియా.. డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన‌ట్టు ఒప్పుకున్న రియా చ‌క్ర‌వ‌ర్తి.. కేధార్ నాథ్ చిత్ర షూటింగ్‌ స‌మ‌యంలో సుశాంత్ త‌న కోస్టార్స్ తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు చెప్పిన‌ట్టు స‌మాచారం. సుశాంత్ చెబితేనే తాను వాట్సాప్‌లో డ్ర‌గ్స్ గురించి చాట్ చేసాన‌ని రియా చెబుతుంద‌ట‌. సుశాంత్ డ్ర‌గ్స్ తీసుకుంటున్న విష‌యం ఎవ‌రికి తెలియ‌దు. అవి అత‌ని స్టాఫ్ మెంబ‌ర్స్ ద్వారా డెలివ‌రీ అవుతుంటాయ‌ని రియా స్ప‌ష్టం చేసిన‌ట్టు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. 


logo