శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 10:07:17

సుశాంత్ అకౌంట్ల నుంచి రియాకు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌..

సుశాంత్ అకౌంట్ల నుంచి రియాకు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌..

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకౌంట్ల నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తికి  న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు ఈడీ విచార‌ణాధికారులు గుర్తించారు.  జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని త‌న ఇంట్లో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.  అయితే మ‌నీల్యాండ‌రింగ్ జ‌రిగి ఉంటుంద‌న్న కోణంలో ఈడీ విచారిస్తున్న‌ది. సుశాంత్‌కు కోట‌క్ మ‌హేంద్ర, హెచ్‌డీఎఫ్‌, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. కోట‌క్‌, హెచ్‌డీఎఫ్‌సీలో ఉన్న అకౌంట్ల‌లో పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే ఆ రెండు అకౌంట్ల నుంచి రియాకు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. 

రియా చ‌క్ర‌వ‌ర్తికి, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు ముంబైలోని ప్రైమ్‌లొకేష‌న్‌లో రెండు ప్రాప‌ర్టీలు ఉన్నాయి. ఆ రెండు ప్రాప‌ర్టీల‌ను ఇటీవ‌లే కొనుగోలు చేశారు. ఆ ప్రాప‌ర్టీల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను చూపించాల‌ని ఈడీ అధికారులు డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముంబై శివార్ల‌లో సుశాంత్‌కు చిన్న ఫార్మ్‌హౌజ్ కూడా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ముంబై స‌మీపంలోని గోరేగావ్‌లో కూడా అపార్ట్‌మెంట్ ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.  సుశాంత్‌కు రెండు కార్లు ఉన్నాయ‌ని, దాంట్లో ఒక‌టి లోన్ క‌డుతున్న‌ట్లు తేలింది. 


logo