గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 03, 2021 , 22:04:41

కొత్త ఇంటి కోసం రియా అన్వేషణ

కొత్త ఇంటి కోసం రియా అన్వేషణ

ముంబై: బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి కొత్త ఇంటి కోసం అన్వేషిస్తున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఆదివారం మీడియా కంటపడ్డారు. వారిద్దరు మాస్కులు ధరించి ఉన్నారు. కాగా రియా చక్రవర్తి ధరించిన టీ షర్టుపై ‘లవ్‌ ఈజ్‌ పవర్‌’ అని ఉండటం ఆకట్టుకున్నది. 

గత ఏడాది జూన్‌ 14న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మరణం వెనుక ప్రియురాలైన ఆమె పాత్ర ఉన్నట్లు ఆయన తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. మరోవైపు డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేప్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు (ఎన్సీబీ) గత ఏడాది సెప్టెంబర్‌లో రియాను అరెస్ట్‌ చేసింది. సుమారు నెల రోజులపాటు జైలులో ఉన్న ఆమె అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo