శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 11:25:46

డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తికి బెయిల్ మంజూరు

డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తికి బెయిల్ మంజూరు

హైద‌రాబాద్: బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. ఆమె సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది.  హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆ ఇద్ద‌ర్నీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.  అయితే డ్ర‌గ్స్ కేసులోనే అరెస్టు అయిన శామ్యూల్ మిరిండా, దీపేశ్ సావంత్‌ల‌కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది.  మ‌రో డ్ర‌గ్ పెడ్ల‌ర్ అబ్దుల్ బాసిత్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు వ్య‌తిరేకించారు.  దాదాపు నెల రోజుల త‌ర్వాత రియాకు బెయిల్ మంజూరీ అయ్యింది.  త‌న‌కు ఉన్న మాద‌క‌ద్ర‌వ్యాల అల‌వాటును క‌ప్పిపుచ్చేందుకు సుశాంత్ సింగ్ .. త‌న‌ను పావుగా వాడుకున్న‌ట్లు రియా త‌న బెయిల్ పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది.  త‌న సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిని కూడా సుశాంత్ టార్గెట్ చేసిన‌ట్లు రియా పేర్కొన్న‌ది. వాస్త‌వానికి ఈ కేసులో నిన్నే ప్ర‌త్యేక కోర్టు రియా జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని ఈనెల 20వ తేదీ వ‌ర‌కు పొడిగించింది.

డ్ర‌గ్స్ కేసులో రియా 29 రోజుల పాటు జైలులో ఉన్న‌ది. జ‌స్టిస్ ఎస్‌వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఇవాళ రియాకు బెయిల్ మంజూరీ చేసింది. సెప్టెంబ‌ర్ 8వ తేదీన రియాను అరెస్టు చేశారు. ఆమె వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా ఎన్సీబీ ఆమెను అరెస్టు చేసింది.  డ్ర‌గ్స్ సిండికేట్‌లో రియా యాక్టివ్ స‌భ్యురాలిగా ఉన్న‌ట్లు ఎన్సీబీ ఆరోపించింది.  డ్ర‌గ్ ప్రొక్యూర్మెంట్ కోసం ఆర్థిక లావాదేవీల‌ను రియా చూసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  సుశాంత్ సింగ్ మృతి కేసులో విచార‌ణ చేప‌డుతున్న సీబీఐని .. హీరో కుటుంబ‌స‌భ్యులే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని రియా లాయ‌ర్ స‌తీశ్ మాన్‌షిండే ఆరోపించారు.

ల‌క్ష రూపాయాల బాండ్‌పై రియాను రిలీజ్ చేసేందుకు అంగీక‌రించారు.  అయితే వ‌రుస‌గా ప‌ది రోజుల పాటు ఆమె స‌మీప పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రు కావాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను డిపాజిట్ చేయాలి. కోర్టు అనుమ‌తి లేకుండా.. దేశం విడిచి వెళ్ల‌కూడ‌దంటూ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు.  


logo